Please enable javascript.జెరోధా: Zerodha Down : జెరోధాలో మరోసారి సాంకేతిక సమస్య.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రేడర్లు.. - zerodha down for second time in a month company acknowledges the technical glitch | The Economic Times Telugu

Zerodha Down : జెరోధాలో మరోసారి సాంకేతిక సమస్య.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రేడర్లు..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 21 Jun 2024, 2:51 pm

జెరాధో యాప్,వెబ్ సైట్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. కొత్త ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావల్లటేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో బ్రోకరేజ్ యాప్ ఐఐఎఫ్ఎల్ కూడా సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.

 
Zerodha down

Representative Image


ప్రముఖ ఆన్ లైన్ స్టాక్ బ్రోకరేజీ ప్లాట్ ఫారం జెరోధాలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. నెల రోజుల్లోనే రెండోసారి సర్వర్ డౌన్ అయింది. దీంతో ట్రేడర్లు కంపెనీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన ట్రేడింగ్ సెషన్ లో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావట్లేదని పేర్కొన్నారు. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ కూడా జెరోధా యూజర్లు దేశవ్యాప్తంగా సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.
సాంకేతిక సమస్య కారణంగా జెరోధా ప్లాట్ ఫారం వేదికగా ట్రేడర్లు కొత్త ఆర్డర్లను పెట్టలేకపోతున్నారు. అలాగే ఇప్పటికే చేసిన ఆర్డర్లను మాడిఫై చేసుకోలేకపోతున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. వీకెండ్ లో కీలకమైన సెషన్ కావడంతో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జెరోధాలో ఇలాంటి సమస్య ఎదురవ్వడం ఇది నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి కావడం గమనార్హం. దీంతో ఈ ప్లాట్ ఫారంను ఉపయోగిస్తున్న యూజర్లు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డౌన్ డిటెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం జెరోధా మొబైల్ యాప్ కైట్ ను ఉపయోగించే వారిలో 49 శాతం మంది యూజర్లు సమస్యను ఎదుర్కొన్నారు. అలాగే జెరోధా వెబ్ సైట్ ను ఉపయోగించే యూజర్లలో 32 శాతం మందికి ఇబ్బంది ఎదురైంది. 20 శాతం మంది యూజర్లు అసలు ట్రేడింగ్ చేయడానికే వీల్లేకుండా అయింది.

సాంకేతిక సమస్యను జెరోధా కూడా అంగీకరించింది. ఓ యూజర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ కు స్పందించి. జేరోధాలో చాలా సమస్యలు ఉన్నాయి, మేము వేరే ప్లాట్ ఫారానికి మారుతున్నాం అని వివేక్ కాత్రి అనే యూజర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన జెరోధా తాము సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లుతెలిపింది. ఐఐఎఫ్ఎల్ కూడా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

జెరోధాతో పాటు మరో బ్రోకరేజ్ సంస్థ ఐఐఎఫ్ఎల్ కూడా ఈరోజు సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. ఈ ప్లాట్ ఫారంలో డెరివేటివ్ ఆర్డర్లు చేసే యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఆర్డర్లు చేయడానికి లేదా ఇప్పటికే చేసిన ఆర్డర్ కు మార్పులు చేయడానికి అవకాశం లేకుండా సాంకేతిక సమస్య ఎదురైనట్లు వెల్లడించింది.

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఇన్వెస్టర్లకు ప్రతి నిమిషం చాలా కీలకం. క్షణాల్లోనే పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. ముఖ్యంగా వీకెండ్స్ లో ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి. సరైన టైమ్ లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే జెరోధా సాంకేతిక సమస్యలపై ట్రేడర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో ఆన్ లైన్ స్టాక్ బ్రోకరేజీ ప్లాట్ ఫారాల్లో జెరోధా నెంబర్ 2 స్థానంలో ఉంది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తితే కంపెనీ భారీగా యూజర్లను కోల్పోయో ముప్పు ఉంటుంది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More