Please enable javascript.అంబే లేబొరేటరీస్ లిమిటెడ్ ఐపీఓ: Ambey Laboratories Limited IPO : లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మరొక రెండు రోజులో కొత్త ఐపీఓ.. - ambey laboratories limited ipo will open for subscription on july 04 must know about gmp and listing gains | The Economic Times Telugu

Ambey Laboratories Limited IPO : లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. మరొక రెండు రోజులో కొత్త ఐపీఓ..

Authored by Rupesh | The Economic Times Telugu | Updated: 2 Jul 2024, 12:04 pm

నాలుగు దశాబ్దాల నుంచి పంటల రక్షణ కోసం వ్యవసాయ రసాయన ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు 2,4-D బేస్ కెమికల్స్ ను తయారు చేసి సరఫరా చేసే కంపెనీ అయిన అంబే లేబొరేటరీస్ లిమిటెడ్ ఐపీఓ జూలై 04, 2024 నుంచి ఓపెన్ అవ్వనుంది.

 
Ambey Laboratories Limited IPO
Representative Image
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) లో పెట్టుబడులు పెట్టి మంచి లిస్టింగ్ గెయిన్స్ పొందాలని భావించే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం ఎల్లుండి నుంచి మరొక ఐపీఓ అందుబాటులోకి రానుంది. సుమారు నాలుగు దశాబ్దాల నుంచి పంటల రక్షణ కోసం వ్యవసాయ రసాయన ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు 2,4-D బేస్ కెమికల్స్ ను తయారు చేసి సరఫరా చేసే కంపెనీ అయిన అంబే లేబొరేటరీస్ లిమిటెడ్ కి సంబంధించిన ఐపీఓ జూలై 04, 2024 నుంచి సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవ్వనుంది. ఈ ఐపీఓ జూలై 04 నుంచి ఓపెన్ అయ్యి జూలై 08 వరకు అందుబాటులో ఉండనుంది.

ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ. 44.68 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 65 నుంచి రూ. 68 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓలో పాల్గొనాలనుకునే పెట్టుబడిదారులు కనీసం 2000 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, అనగా రూ. 1,36,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ కంపెనీ ఈక్విటీ షేర్లు జూలై 11న ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో లిస్ట్ అవ్వనున్నాయి.


ఈ ఐపీవో ద్వారా కంపెనీ ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 62,58,000 ఈక్విటీ షేర్లను విక్రయించి రూ. 42.55 కోట్లను, అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 3,12,000 ఈక్విటీ షేర్లను విక్రయించి రూ. 2.12 కోట్లను పొందాలని భావిస్తుంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీకి సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, అలాగే కంపెనీ సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం, అదేవిధంగా ఇష్యూ కి అయ్యే ఖర్చుల కోసం వినియోగించనుంది. ఇక ఈ ఐపీఓకు లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్ గా వ్యవహరించనుండగా, ఈ ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మ్యానేజర్ గా ఫాస్ట్ ట్రాక్ ఫిన్సెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తుంది.

ఇక ఈ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటాను, అలాగే ఎన్ఐఐ లకు 15 శాతం వాటాను, అదేవిధంగా క్యూఐబీలకు 50 శాతం వాటాను కంపెనీ కేటాయించడం జరిగింది. ఈ ఐపీఓకి సంబంధించిన డేట్స్ ను ఒకసారి పరిశీలిస్తే, జూలై 09 న షేర్లు ఎలాట్మెంట్ జరగనుండగా, జూలై 10 న ఎలాట్మెంట్ వచ్చిన వారి డీమ్యాట్ ఖాతాలలో షేర్లను క్రెడిట్ చేస్తారు, ఇక జూలై 11 న షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వనున్నాయి. ఇక ఈ రోజు అంబే లేబొరేటరీస్ లిమిటెడ్ ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 22 లుగా ఉంది. ఒకవేళ మీకు ఈ ఐపీఓ అలాట్మెంట్ లభించినట్లైతే, 32 శాతం లిస్టింగ్ గెయిన్స్ ను పొందే అవకాశం ఉంటుంది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
Rupesh గురించి
Rupesh Senior Digital Content Producer