Please enable javascript.లార్జ్ క్యాప్ స్టాక్స్ టు బై: ​Large Cap Stocks : మార్కెట్లు పడిపోయినా బేఫికర్.. రాబోయే రోజుల్లో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న 5 లార్జ్ క్యాప్ స్టాక్స్ - The Economic Times Telugu

​Large Cap Stocks : మార్కెట్లు పడిపోయినా బేఫికర్.. రాబోయే రోజుల్లో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న 5 లార్జ్ క్యాప్ స్టాక్స్

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 21 Jun 2024, 12:35 pm

భారత స్టాక్ మార్కెట్లు ఎన్నికల ఫలితాల తర్వాత బుల్లిష్ గా ఉన్నాయి. సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ఈ క్రమంలోనే అధిక వాల్యూమ్ ను నమోదు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు మళ్లీ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వారు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా వీటిపై ఎక్కువ ప్రభావం ఉండదు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్సే తీవ్రంగా నష్టపోతుంటాయి. అందుకే మార్కెట్ పరిస్థితితో సంబంధం లేకుండా రాబోయే రోజుల్లో బుల్లిష్ గా ఉండే ఐదు లార్జ్ క్యాప్ స్టాక్స్ ను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

 
five large cap stocks kalyan jewellers century textiles united breweries kaynes technology phoenix mills with upside potential up to 30 percent
​Large Cap Stocks : మార్కెట్లు పడిపోయినా బేఫికర్.. రాబోయే రోజుల్లో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న 5 లార్జ్ క్యాప్ స్టాక్స్

కల్యాణ్ జ్యువెల్లర్స్

ఈ స్టాక్ లాంగ్ టర్మ్ లో, అంటే ఏడాది కాలంలో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆరుగురు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బై రేటింగ్ ఇచ్చారు. గత నెల రోజుల్లో షేరు ధర 2.2 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 223 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 43 వేల కోట్లకు పైగా ఉంది. ప్రస్తుతం షేరు ధర రూ. 434 వద్ద ట్రేడ్ అవుతోంది.

సెంచురీ టెక్స్ టైల్స్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ముగ్గురు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. గత నెల రోజుల్లో షేరు ధఱ 9 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 201 శాతం రిటర్నులు ఇచ్చింది. ప్రస్తుతం షేరు ధర రూ. 2,255 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ. 25 వేల కోట్లుగా ఉంది.

యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 16 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని 15 మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. గత నెల రోజుల్లో షేరు ధర 8.6 శాతం పెరిగింది. ఏడాది కాలంలో 38 శాతం పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ. 2,085 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 55 వేల కోట్లకు పైగా ఉంది.

కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 9 శాతం వరకు పెరగవచ్చని 19 మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బై రేటింగ్ ఇచ్చారు. గత నెల రోజుల్లో షేరు ధర 26 శాతం పెరిగింది. ఏడాది కాలంలో 149 శాతం రిటర్నులు ఇచ్చింది. ప్రస్తుతం షేరు ధర రూ. 3,855 వద్ద ట్రేడ్ అవుతోంది, కంపెనీ మార్కెట్ విలువ రూ. 24 వేల 630 కోట్లుగా ఉంది.

ఫియోనిక్స్ మిల్స్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 6 శాతానికిపైగా పెరగవచ్చని 15 మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బై రేటింగ్ ఇచ్చారు. గత నెల రోజుల్లో షేరు ధర 25 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 140 శాతం రిటర్నులు ఇచ్చింది. ప్రస్తుతం షేరు ధర రూ. 3,590 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 64 వేల కోట్లకుపైగా ఉంది.

గమనిక: ఈ కథనం విశ్లేషకుల సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. స్టాక్ ను కొనుగోలు చేయాలని లేదా విక్రయించాలని ఎకనామిక్ టైమ్స్ సూచించదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోండి.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More