Please enable javascript.స్మాల్ క్యాప్ స్టాక్స్: Stock Recommendations : రాబోయే రోజుల్లో 47 శాతం వరకు పెరిగే అవకాశమున్న 5 విభిన్న రంగాల స్మాల్ క్యాప్ స్టాక్స్.. - The Economic Times Telugu

Stock Recommendations : రాబోయే రోజుల్లో 47 శాతం వరకు పెరిగే అవకాశమున్న 5 విభిన్న రంగాల స్మాల్ క్యాప్ స్టాక్స్..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 22 Jun 2024, 10:06 am

స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలా ఓపికతో ఎదురుచూడాలి. అప్పుడే మంచి రిటర్నులు పొందే అవకాశం ఉంటుంది. లేదంటే చాలా రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఐదు స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి రిటర్నులు అందించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవి రాబోయే రోజుల్లో 47 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 
five small cap stocks hindware home innovation somany ceramics mahindra logistics apollo pipe nrb bearings can grow up to 47 percent
Stock Recommendations : రాబోయే రోజుల్లో 47 శాతం వరకు పెరిగే అవకాశమున్న 5 విభిన్న రంగాల స్మాల్ క్యాప్ స్టాక్స్..

హిండ్ వేర్ హోమ్ ఇన్నోవేషన్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 47.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 8.2 శాతం రిటర్నులు ఇచ్చింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,943 కోట్లుగా ఉంది.

​సోమెనీ సిరామిక్స్

ఈ స్టాక్ రానున్న రోజుల్లో 33.7 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని 18 మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కూడా స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. గత మూడు నెలల్లో షేరు ధర 15.5 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 3.010 కోట్లుగా ఉంది.

​మహీంద్రా లాజిస్టిక్స్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 28.2 శాతం వరకు పెరగవచ్చని 11 మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీని హోల్డ్ చేసుకోవాలని సూచించారు. గత మూడు నెలల్లో షేరు ధర 17.4 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,456 కోట్లుగా ఉంది.

​అపోలో పైప్స్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 21.9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఏడుగురు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బై రేటింగ్ ఇచ్చారు. గత మూడు నెలల్లో షేరు ధర 4.3 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,700 కోట్లుగా ఉంది.

ఎన్ఆర్బీ బేరింగ్స్

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో 19.7 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఇద్దరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. గత మూడు నెలల్లో షేరు ధర రూ. 25.3 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,235 కోట్లుగా ఉంది.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. విశ్లేషకుల సొంత అభిప్రాయాన్ని తెలిజయజేస్తుంది. ఎకనామిక్ టైమ్స్ స్టాక్స్ ను కొనుగోలు చేయాలని లేదా విక్రయించాలని సూచించదు.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More