Please enable javascript.స్టాక్ స్ప్లిట్: Green Energy Stock: మొట్టమొదటిసారి స్టాక్ స్ప్లిట్ చేస్తున్న కంపెనీ.. సగానికి తగ్గనున్న షేరు ధర.. రికార్డు తేదీ ఫిక్స్.. - The Economic Times Telugu

Green Energy Stock: మొట్టమొదటిసారి స్టాక్ స్ప్లిట్ చేస్తున్న కంపెనీ.. సగానికి తగ్గనున్న షేరు ధర.. రికార్డు తేదీ ఫిక్స్..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 4 Jul 2024, 11:09 am

గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఫోకస్ లో నిలిచింది. ఇప్పటివరకు బోనస్ షేర్లు, డివిడెండ్లు ప్రకటించిన ఈ కంపెనీ, మొట్టమొదటిసారి స్టాక్ స్ప్లిట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి రికార్డు తేదీని కూడా ఫిక్స్ చేసింది. దీంతో షేర్లు ఈరోజు కాస్త అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేరు ధర 0.6 శాతం తగ్గి రూ. 1,785 వద్ద ట్రేడ్ అవతోంది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 2,109 గానూ, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 497 గానూ ఉంది. ఏడాది కాలంలోనే ఇన్వెస్టర్లకు 214 శాతం లాభాలు ఇచ్చి మల్టీబ్యాగర్ స్టాక్ గా అవతరించింది.

 
kpi green energy stock first stock split in 2-1 ratio record date fixed as july 18
Green Energy Stock: మొట్టమొదటిసారి స్టాక్ స్ప్లిట్ చేస్తున్న కంపెనీ.. సగానికి తగ్గనున్న షేరు ధర.. రికార్డు తేదీ ఫిక్స్..

రికార్డు తేదీ

2:1 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్ కు జూలై 18 ని రికార్డు తేదీగా ఖరారు చేసినట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. అంటే ఆ తేదీ నాటికి ఎవరైతే ఈ కంపెనీ షేర్లు కలిగి ఉంటారో అవి రెండుగా విభజించబడతాయి. అప్పుడు షేరు ధర కూడా సగానికి తగ్గుతుంది. ఉదాహరణఖు జూలై 18న కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేరు ధర రూ. 1,800 గా ఉంటే, ఆ మరునాటి నుంచి రూ. 900 కు తగ్గుతుంది. అయితే షేర్ల సంఖ్య మాత్రం రెట్టింపు అవుతుంది. స్టాక్ స్ప్లిట్ ద్వారా షేరు ధర తగ్గినప్పటికీ కంపెనీ మార్కెట్ విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం కేపీఐ గ్రీన్ మార్కెట్ విలువ దాదాపు రూ. 11 వేల కోట్లుగా ఉంది.

బై రేటింగ్

ట్రెండ్ లైన్ డేటా ప్రకారం విశ్లేషకులు ఈ స్టాక్ కు స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 115 శాతం పెరిగవచ్చని పేర్కొన్నారు. అయితే టార్గెట్ ధరను మాత్రం ప్రకటించలేదు. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో నిఫ్టీ 50 కంటే 177 శాతం వృద్ది నమోదు చేసిందని యాక్సిస్ సెక్యూరిటీస్ తెలిపింది. గత ఏడు నెలల్లో 58 శాతం మెరుగుపడినట్లు పేర్కొంది.

ఆర్డర్లు

కాగా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఇటీవలీ కాలంలో పలు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఆర్డర్లు కూడా దక్కించుకుంది. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో 214 శాతం పెరిగింది. గడిచిన 6 నెలల్లో 91 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది ఇప్పటివరకు 88 శాతం పెరిగింది. ఐదేళ్లలో చూసుకుంటే ఏకంగా 914 శాతం రిటర్నులు అందించి ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బోనస్ షేర్లు కూడా జారీ చేసింది.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ రికమండేషన్ కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More