Please enable javascript.52 వారాల గరిష్ట స్థాయి: 52 Week High : జెఫరీస్ బై రేటింగ్ ఇవ్వడంతో భారీగా పెరిగి అల్ టైమ్ హై లెవెల్ ని టచ్ చేసిన స్టాక్.. ఇంకా పెరిగే అవకాశం ఉందన్న బ్రోకరేజ్.. - large cap textile stock touches latest 52 week high level as jefferies gave buy rating | The Economic Times Telugu

52 Week High : జెఫరీస్ బై రేటింగ్ ఇవ్వడంతో భారీగా పెరిగి అల్ టైమ్ హై లెవెల్ ని టచ్ చేసిన స్టాక్.. ఇంకా పెరిగే అవకాశం ఉందన్న బ్రోకరేజ్..

Authored by Rupesh | The Economic Times Telugu | Updated: 2 Jul 2024, 9:41 am

టెక్స్టైల్ సెక్టార్ కి చెందిన లార్జ్ క్యాప్ కేటగిరి స్టాక్ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో భారీగా లాభపడి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకడం జరిగింది.

 
52 week high
Representative Image
లార్జ్ క్యాప్ కేటగిరికి చెందిన టెక్స్టైల్ సెక్టార్ స్టాక్ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో భారీగా లాభపడి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకడం జరిగింది. నిన్న క్లోజింగ్ సమయంలో ఈ షేర్ ధర 3 శాతానికి పైగా లాభపడి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 2743.90 మార్క్ ను టచ్ చేయడం జరిగింది.

మరొకవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాది కాలంలో 53 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ అయిన జఫరీస్, ఈ షేరుకు బై రేటింగ్ ఇవ్వడంతో ఈ షేరు ధరలో ఒక్కసారిగా ర్యాలీ కనిపించింది. దీనిలో భాగంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరుకు రూ. 3000 టార్గెట్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు జఫరీస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచించింది.


కంపెనీ స్టాక్ అవుట్ లుక్ ను ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ధర సుమారు 0.17 శాతం లాభపడి రూ. 2731.05 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 2743.90 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 1726.35 గా ఉంది. గత వారం రోజులలో ఈ షేరు సుమారు 8 శాతం లాభాన్ని, అలాగే గత నెల రోజులల్లో ఈ షేరు సుమారు 15 శాతం లాభాన్ని, అదే విధంగా గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 31 శాతం లాభాన్ని, అదే గత ఏడాది కాలంలో ఈ షేరు సుమారు 53 శాతం లాభాన్ని, ఇక గత ఐదు సంవత్సరాల కాలంలో 197 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 1,86,000 కోట్లుగా ఉంది.

కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది దేశంలోని ప్రముఖ బిజినెస్ గ్రూప్ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన కంపెనీ. ఈ కంపెనీ టెక్స్టైల్ బిజినెస్ లోకి అడుగుపెట్టి విస్కోస్ స్టేపుల్ ఫైబర్, విస్కోస్ ఫిలమెంట్ యార్న్, కెమికల్స్, ఇన్సులేటర్స్ వంటి టెక్స్టైల్ రా మెటీరియల్స్ ను తయారు చేస్తుంది. ఇక ఈ కంపెనీని 1947 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇక ఈ కంపెనీ ఆర్ధిక రాజధాని అయిన ముంబై కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 2023 చివరి నాటికి ఈ కంపెనీలో మొత్తం 24,455 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
Rupesh గురించి
Rupesh Senior Digital Content Producer