Please enable javascript.సకుమ ఎక్స్ పోర్ట్స్ టార్గెట్ ధర: Bonus Shares : బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఒక్క షేరుకు 4 షేర్లు ఉచితం.. భారీగా పెరిగే అవకాశమున్న స్టాక్.. - The Economic Times Telugu

Bonus Shares : బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఒక్క షేరుకు 4 షేర్లు ఉచితం.. భారీగా పెరిగే అవకాశమున్న స్టాక్..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 2 Jul 2024, 10:15 am

అగ్రో కమోడిటీస్ సెక్టార్ కు చెందిన సకుమ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ కీలక ప్రకటలనలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం అనంతరం బోనస్ షేర్లతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. కంపెనీని వృద్ధి పథంలో నడిపించడం, ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంంధించిన వవరాలు ఇప్పుడు చూద్దాం.

 
sakuma exports 1-4 bonus shares issue check full details here
Bonus Shares : బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఒక్క షేరుకు 4 షేర్లు ఉచితం.. భారీగా పెరిగే అవకాశమున్న స్టాక్..

​బోనస్ షేర్లు

కంపెనీ చెసిన ముఖ్యమైన ప్రకటనల్ల బోనస్ షేర్లు ఒకటి. షేర్ హోల్డర్లు కలిగి ఉన్న ప్రతి షేరుకు 4 బోనస్ షేర్లు ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే బోనస్ షేర్లకు అర్హతను నిర్ణయించే రికార్డు తేదీని మాత్రం వెల్లడించలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆథరైడ్జ్ షేర్ క్యాపిటల్

కంపెనీ అధికారిక షేర్ క్యాపిటల్ ను రూ. 40 కోట్ల నుంచి రూ. 275 కోట్లకు పెంచుకోనున్నట్లు తెలిపింది. దీనికి షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అలాగే మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ లో క్యాపిటల్ క్లాస్ కు సవరణలు కూడా చేయాల్సి ఉందని తెలిపింది. దీని ద్వారా కంపెనీకి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. భవిష్యత్తులో వృద్ధి అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది.

క్యూఐపీ

అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ( QIP), ఇతర ఆమోదయోగ్యమైన మార్గాల ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కంపెనీ క్యాపిటల్ బేస్ ను పెంచుకునేందుకు అని పేర్కొంది. విస్తరణ, మార్కెట్ పొజిషన్ ను మెరుగుపరచుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో దీనికి షేర్ హోల్డర్ల ఆమోదం పొందనున్నట్లు తెలిపింది.

ఇన్వెస్టర్లకు బూస్ట్

సకుమా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ ప్రస్తుతం రూ. 35 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ చేసిన ప్రకటనలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచే అవకాశముంది. ఆర్థికంగా బలంగా ఉండటం, ఫండమెంటల్ గా బలంగా ఉండటం, వ్యూహాత్మక వృృద్ధి ప్రణాళికలు వంటివి ఈ స్టాక్ పై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది రూ. 150 టార్గెట్ ధరను చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ రికమండేషన్ కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More