Please enable javascript.సుమీత్ బగాడియా రికమండెడ్ స్టాక్స్: Stocks To buy On Monday : సోమవారం ట్రేడింగ్ కోసం మూడు స్టాక్స్ ను రికమండ్ చేసిన సుమీత్ బగాడియా.. టార్గెట్ ధరలు ఎంతంటే..? - The Economic Times Telugu

Stocks To buy On Monday : సోమవారం ట్రేడింగ్ కోసం మూడు స్టాక్స్ ను రికమండ్ చేసిన సుమీత్ బగాడియా.. టార్గెట్ ధరలు ఎంతంటే..?

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 22 Jun 2024, 3:06 pm

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. సూచీలు అధిక స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లకు ప్రాఫిట్ బుకింగ్స్ కు మొగ్గుచూపారు. కొత్త ట్రిగర్స్ ఏమీ లేకపోవడంతో వీకెండ్ లో లాభాల కోసం షేర్లను విక్రయించారు. అయితే వారం మొత్తంగా చూస్తే మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరిగాయి. అయితే మార్కెట్ మీడియం టర్మ్ లో ఇంకా పాజిటివ్ గానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ కోసం మూడు స్టాక్స్ ను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు ప్రముఖ అనలిస్ట్, చాయిస్ బ్రోకింగ్ కు చెందిన సుమీత్ బగాడియా. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

 
stocks to buy on monday sumeet bagadia recommends bharti airtel interglobe aviation dr reddys laboratories for intraday
Stocks To buy On Monday : సోమవారం ట్రేడింగ్ కోసం మూడు స్టాక్స్ ను రికమండ్ చేసిన సుమీత్ బగాడియా.. టార్గెట్ ధరలు ఎంతంటే..?

భారతీ ఎయిర్టెల్

ఈ స్టాక్ శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రూ. 1,416 వద్ద స్థరపడింది. టెలికాం సెక్టార్ లో అతి పెద్ద కంపెనీలో ఒకటైన ఎయిర్టెల్ షేరు రూ. 1,450 స్థాయి వద్ద బ్రేకవుట్ అయినట్లు సుమీత్ బగాడియా విశ్లేషించారు. ఇది 7 శాతం పెరిగి రూ. 1,520 స్థాయిని చేరుకునే అవకాశం ఉందన్నారు. అయితే స్టాప్ లాస్ ను రూ. 1,360 వద్ద సెట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈస్టాక్ 20, 50, 200 రోజుల చలన సగటు కంటే అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతోందని, ఇది బలమైన ప్రదర్శనకు సంకేతమని తెలిపారు.

ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో)

ఇండిగో షేరు ధర శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రూ. 4,130 వద్ద స్థిరపడింది. ఇది 7 శాతం పెరిగి రూ. 4,600 టార్గెట్ ధరను చేరుకునే అవకాశం ఉందని బగాడియా సూచిస్తున్నారు. అయితే స్టాప్ లాస్ ను రూ. 4,180 వద్ద సెట్ చేసుకోవాలని సూచించారు. ఈ స్టాక్ రూ. 4,250 వద్ద రెసిస్టెన్స్ ను అధిగమించిందని వివరించారు. 20, 50, 200 రోజుల ఎక్స్ పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతోందని, ఇది బుల్లిష్ నెస్ కు సంకేతమని చెప్పారు.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్

శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు ధర రూ. 6,011 వద్ద స్థిరపడింది. ఇది 6 శాతం పెరిగి రూ. 6,380 టార్గెట్ ధరను చేరుకునే అవకాశం ఉందని బగాడియా అంచనా వేస్తున్నారు. అయితే స్టాప్ లాస్ ను రూ. 5,800 వద్ద సెట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ స్టాక్ 20, 50, 200 రోజుల ఎక్స్ పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ కంటే ఎక్కవ ధర ట్రేడ్ అవుతోందని, మున్ముందు బలంగా ముందుకు సాగే అవకాశముందని పేర్కొన్నారు.

గమనిక: ఈ కథనం కేవలం విశ్లేషకుల సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. స్టాక్స్ ను కొనుగోలు చేయాలని గానీ, లేదా విక్రయించాలని గానీ ఎకనామిక్ టైమ్స్ సూచించదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవడం మంచిది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More